అంబేద్కర్ కాలేజీలో సందడిగా స్పోర్ట్స్ డే వేడుకలు.. ఆటల్లో ప్రతిభను చాటిన విద్యార్థులు

అంబేద్కర్ కాలేజీలో సందడిగా స్పోర్ట్స్ డే వేడుకలు.. ఆటల్లో ప్రతిభను చాటిన విద్యార్థులు

ముషీరాబాద్, వెలుగు: బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీలో యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కబడ్డీ, కోకో, వాలీబాల్, త్రోబాల్, షార్ట్ పుట్, రన్నింగ్ రేస్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీల్లో విద్యార్థులు తమ టాలెంట్ చూపించారు. 

కార్యక్రమానికి కాలేజీ సెక్రెటరీ, ఎమ్మెల్యే జి. వినోద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శారీరక, మానసిక వికాసంతోపాటు విద్యార్థులు బాగా ఎదగడానికి ఆటలు ఎంతో తోడ్పడతాయన్నారు. భవిష్యత్తులో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించి కాలేజీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాలేజీ సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ మట్ట శేఖర్, డాక్టర్ జి. కృష్ణ శర్మ, శ్రావణ్, డాక్టర్ పాండు, మహేందర్, టీచర్లు పాల్గొన్నారు.