
ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది నయనతార. సిల్వర్ స్క్రీన్‌పై తిరుగులేని స్టార్‌డమ్‌ని సంపాదించిన ఆమె, ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అది కూడా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ‘బాహుబలి’ ప్రీక్వెల్‌తో. రాజమౌళి, ప్రసాద్ దేవినేనితో కలిసి ‘బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తోంది నెట్‌ఫ్లిక్స్. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టైల్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌లో నయనతార నటించ నుందట. సెప్టెంబర్ నుండి షూట్ స్టార్ట్ కానుంది. మూడు సీజన్స్‌లో మొదటి సీజన్ షూట్‌ని దాదాపు పూర్తి చేశారు. కానీ అవుట్‌పుట్ విషయంలో తృప్తి లేకపోవడంతో తీసినదంతా పక్కన పెట్టేసి మళ్లీ మొదట్నుంచి తెరకెక్కించ బోతున్నారు. ఎంతో కీలకమైన శివగామి పాత్రకి వమికా గబ్బీని తీసుకున్నారు. నయనతారని ఏ పాత్రకి తీసు కున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ ఇది స్ట్రీమ్ కానుంది. బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’కి ప్రీక్వెల్ సిరీస్ కనుక అంచనాలు ఎక్కువ ఉన్నాయి. నయనతార లాంటి స్టార్ యాడ్ అవుతుండడంతో మరింత హైప్ వచ్చింది. మరోవైపు షారుఖ్‌తో అట్లీ తీయనున్న సినిమాతో నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.