ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన కేసులో డ్రైవర్‌కు బెయిల్

ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన కేసులో డ్రైవర్‌కు బెయిల్

ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‍మెంట్‌లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన కేసులో డ్రైవర్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. జూలై 28న ఓల్డ్ రాజేందర్ నగర్‌లో భారీ వరదల కారణంగా బేస్‌మెంట్‌లోని నీరు చేరింది. అందులో ఉన్న సివిల్స్ అభ్యర్థులు ముగ్గురు నీట మునిగి చనిపోయారు. రోడ్డుపై కారు వేగంగా పోవడంతో బేస్ మెంట్ గేట్లు ఊడిపోయి వరద అందులోకి వెళ్లింది. 

ఈ ఘటనలో ఎస్‌యూవీ కారు డ్రైవర్ మనోజ్ కతురియాను ప్రధాన నింధితుని పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని డ్రైవర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించాడు. దీంతో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు డ్రైవర్ మనోజ్ కు బెయిల్ మంజూరు చేసింది.