
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారనే కేసులో బెయిల్ పిటిషన్లు ఫైల్ అయ్యాయి. కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో డిఫెన్స్ లాయర్లు పిటిషన్లు వేశారు. రామచంద్రభారతి, సింహయాజీలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. లాయర్ల అభ్యర్థనతో ఏసీబీ జడ్జి పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. కౌంటర్ ఫైల్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. రామచంద్రభారతి, సింహయాజీల అనారోగ్యంపై దాఖలైన పిటిషన్‌ను రేపటికి వాయిదా వేశారు.