ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డికి బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డికి బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా జైల్లో ఉన్న నిందితుడు శరత్ చంద్రారెడ్డికి  సోమవారం( మే 8) ఢిల్లీ హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది.తన  భార్యకు అనారోగ్యంగా ఉందని.. ఆమె బాగోగులు చూసుకోవాలని.. రెగ్యులర్ బెయిల్ మంజూరు  చేయాలని  ఢిల్లీ హైకోర్టును కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. బెయిల్  మంజూరు చేసింది. 

2022  నవంబర్  09 వ తేదీన  శరత్ చంద్రారెడ్డిని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను విచారించిన ఈడీ అధికారులు.. వారిద్దరినీ ఒకే రోజు అరెస్ట్  చేశారు. విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారి పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో  సీబీఐ, ఈడీ అధికారులు గత ఏడాదిలో పలుమార్లు సోదాలు నిర్వహించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వారిలో శరత్ చంద్రారెడ్డికి మాత్రమే బెయిల్ లభించింది. మిగతా వారు జైల్లోనే ఉన్నాయి. మరికొంత మంది బెయిల్ పిటీషన్లు విచారణలో ఉన్నాయి.