బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడు రాహిల్ కు బెయిల్

బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడు రాహిల్ కు బెయిల్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. రాహిల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. రూ. 20 వేలు, రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్ కు నాంపల్లి కోర్టు సూచించింది. పోలీస్ కస్టడీ పిటిషన్ కొట్టి వేసింది. 2023, డిసెంబర్ లో పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద బారికేడ్ లను ఢీ కొన్న కేసులో రాహిల్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ప్రస్తుతం రాహెల్ చంచల్ గూడా జైల్లో ఉన్నారు.