జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్​కు సుప్రీంకోర్టు బెయిల్

జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్​కు సుప్రీంకోర్టు బెయిల్

న్యూఢిల్లీ: హత్రాస్ కేసులో కేరళ జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్​కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. విడుదలైన తర్వాత 6 వారాల పాటు ఢిల్లీలోనే ఉండాలని, ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్​లో రిపోర్టు చేయాలని తెలిపింది. నిందితుణ్ని మూడ్రోజుల్లోగా ట్రయల్ కోర్టులో హాజరుపరిచి, బెయిల్​పై విడుద ల చేయాలని ఆదేశించింది.

సీజేఐ ​జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీచేసింది. 2020 సెప్టెంబర్ 14న హత్రాస్​లో దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు. బాధితురా లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీనిపై రిపోర్టు చేసేందు కు వెళ్తుండగా సిద్దిఖ్​ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నారని కేసు పెట్టడంతో దాదాపు రెండేండ్లుగా సిద్దిఖ్ జైల్లో ఉన్నారు.