షుగర్ ​బాధితులకు ఉందొక పాలసీ

షుగర్ ​బాధితులకు ఉందొక పాలసీ
  • లాంచ్ చేసిన బజాజ్​ అలియాంజ్​

న్యూఢిల్లీ:సాధారణంగా ఇప్పటికే ఉన్న రోగాలకు (ప్రీఎగ్జిస్టింగ్​) కంపెనీలు హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీల్లో కవరేజీ ఇవ్వవు. డయాబెటిస్​/షుగర్ ఉంటే కొన్ని కంపెనీలు అసలు పాలసీనే ఇవ్వవు. బజాజ్​అలియాంజ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ మాత్రం ఈ వ్యాధి బాధితుల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చింది. ‘డయాబెటిక్ టర్మ్​ ప్లాన్​ సబ్​8 హెచ్​బీఏ1సీ’ పేరుతో పిలిచే ఈ పాలసీ టర్మ్​ లైఫ్​ఇన్సూరెన్స్ కవర్​ను అందిస్తుంది. పాలసీహోల్డర్​ మరణిస్తే బీమా చేసిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. పాలసీహోల్డర్​బతికుంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్​ ఉండవు. బజాజ్ అలియాంజ్ లైఫ్ సీఈఓ తరుణ్ చుగ్ మాట్లాడుతూ ‘‘డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారిలో చాలా మందికి బీమా ఉండటం లేదు. డయాబెటిస్​ దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి, దానితో బాధపడుతున్న వారి కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది’’అని ఆయన అన్నారు. 

పాలసీకి ఎవరు అర్హులు ?

టైప్​2 డయాబెటిస్​తో హెచ్​బీఏ1సీ లెవెల్స్​ ఎనిమిది శాతం వరకు ఉన్నవాళ్లు, ప్రి–డయాబెటిస్​ ఉన్న వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. గత 8‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12 వారాల్లో రక్తంలో ప్లాస్మా గ్లూకోజ్​ ఎంత ఉందో హెచ్​బీఏ1సీ ద్వారా లెక్కిస్తారు.  పాలసీ మినిమమ్​ టర్మ్​ ఐదేళ్లు. డయాబెటిక్ టర్మ్​ ప్లాన్​ సబ్​8 హెచ్​బీఏ1సీ గడువు 25 ఏళ్ల వరకు ఉంటుంది. కనీస హామీ మొత్తం రూ.25 లక్షలు ఉంటుంది. హామీ మొత్తానికి గరిష్ట పరిమితి లేదు. దీనిని కంపెనీ అండర్​ రైటింగ్​ పాలసీ ప్రకారం గరిష్ట మొత్తాన్ని నిర్ధారిస్తారు. పాలసీ డాక్యుమెంట్ ప్రకారం, 35 ఏళ్ల మగ నాన్–-స్మోకర్ ప్రీ-డయాబెటిక్​కు రూ. 50 లక్షల హామీ మొత్తంతో, వార్షిక ప్రీమియం చెల్లింపు విధానంతో, 20 ఏళ్ల పాలసీకి ప్రీమియంగా ఏటా రూ. 13,533గా చెల్లించాలి. పాలసీదారులు ఏడాది, ఆర్నెళ్లు, మూడు నెలలు లేదా నెలకు ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు.  బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనుగోలు చేయవచ్చు.

ఇవీ ప్రయోజనాలు..

పాలసీ అమలులో ఉన్న సమయంలో పాలసీదారు మరణిస్తే, నామినీకి హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. పాలసీదారు మరణించిన తర్వాత పాలసీ ముగుస్తుంది. మరణంపై హామీ మొత్తం ఏ)  వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బీ) మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105 శాతం సీ) హామీ మొత్తం... వీటిలో ఏది ఎక్కువగా ఉంటే దానిని చెల్లిస్తారు.  బజాజ్ అలియాంజ్​తన పాలసీదారులు ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండటానికి,  ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పాలసీదారులు తమ హెచ్​బీఏ1సీ స్థాయిలను తగ్గించగలిగితే, మరుసటి సంవత్సరం రెన్యువల్​ సమయంలో బేస్ ప్రీమియంపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. 

నాన్-డయాబెటిక్ వ్యక్తికి రెగ్యులర్ టర్మ్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోల్చితే, బజాజ్ అలియాంజ్ లైఫ్ డయాబెటిక్ టర్మ్ ప్లాన్ సబ్ 8 హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఏ1సీ ప్రీమియం దాదాపు 1.75 రెట్ల నుండి 2 రెట్లు ఎక్కువ అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అడ్వైజర్ దేవ్ ఆశిష్ తెలిపారు. "40 ఏళ్ల డయాబెటిక్  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఏ1సీ స్థాయి 7 వరకు ఉండి.. 25 సంవత్సరాల పాలసీ టర్మ్ తో రూ. కోటికి పాలసీ తీసుకుంటే ఏటా రూ. 24 వేల వరకు కట్టాలి. సాధారణ టర్మ్ ప్లాన్ ప్రీమియం సంవత్సరానికి రూ. 12 వేల వరకు ఉంటుంది”అని ఆయన వివరించారు. డయాబెటిస్​ఉన్న కారణంగా గతంలో పాలసీ తీసుకోలేకపోయిన వారికి, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఏ1సీ స్థాయి 8 వరకు ఉన్న వారికి ఇది అనువైన పాలసీ అని ఇన్వెస్ట్​మెంట్​ అడ్వైజర్​ సహజ్​ అన్నారు.