ఎఫ్​డీలపై వడ్డి రేట్ల పెంపు .. ప్రకటించిన బజాజ్​ ఫైనాన్స్​

ఎఫ్​డీలపై  వడ్డి రేట్ల పెంపు .. ప్రకటించిన బజాజ్​ ఫైనాన్స్​

న్యూఢిల్లీ: బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్‌‌‌‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్  చాలా టెన్యూర్ల (కాలవ్యవధి) ఎఫ్​డీలపై వడ్డీ రేటును 60 బేసిస్ పాయింట్లు పెంచింది. బజాజ్ ఫైనాన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్​అయిన డిపాజిట్- టేకింగ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్​బీఎఫ్​సీ). ఇది ఏప్రిల్ 3, 2024 నుంచి 25–-35 నెలల టెన్యూర్​​ సీనియర్ సిటిజన్ల ఎఫ్​డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.  

18-–24 నెలల టెన్యూర్​​ఎఫ్​డీపై వడ్డీ 40 బేసిస్ పాయింట్లు పెంచింది. నాన్–-సీనియర్ సిటిజన్ల కోసం, 25-–35 నెలల టెన్యూర్​​కు 45 బేసిస్ పాయింట్ల వరకు, 18– 22 నెలల ఎఫ్​డీపై 40 బేసిస్ పాయింట్లు  30–33 నెలల ఎఫ్​డీపై 35 బేసిస్ పాయింట్ల వరకు రేట్లను పెంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్ సిటిజన్లు ఇక నుంచి కూడా 8.85 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. 

సీనియర్ సిటిజన్లు కానివారు 42 నెలల టెన్యూర్​ఎఫ్​డీని డిజిటల్‌‌‌‌గా బుక్ చేసుకోవడం ద్వారా 8.6 శాతం వరకు రేట్లను పొందవచ్చు. పెరిగిన వడ్డీ రేట్ల వల్ల  పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రాబడులు వస్తాయని బజాజ్ ఫైనాన్స్‌‌‌‌లో ఫిక్స్​డ్ డిపాజిట్స్​ఇన్వెస్ట్​మెంట్స్​ హెడ్ సచిన్ సిక్కా అన్నారు. కంపెనీ దేశంలోనే అతిపెద్ద డిపాజిట్ -స్వీకరణ ఎన్​బీఎఫ్​సీగా తాము నిలిచామని అన్నారు. డిపాజిట్​బుక్​ విలువ ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 60 వేల కోట్లపైగా ఉందని వివరించారు.