బజాజ్ సేవా కార్యక్రమాల  కోసం రూ. 5 వేల కోట్లు

బజాజ్ సేవా కార్యక్రమాల  కోసం రూ. 5 వేల కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : వచ్చే ఐదేళ్లలో  కార్పొరేట్  సోషల్‌‌‌‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌), ఛారిటబుల్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని బజాజ్ గ్రూప్ శుక్రవారం ప్రకటించింది.  ‘బజాజ్ బియాండ్‌‌‌‌’ కింద యువత స్కిల్స్‌‌‌‌ను డెవలప్ చేయడంపై ఎక్కువ ఫోకస్ పెడతామని పేర్కొంది. 2 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని ఈ గ్రూప్‌‌‌‌ అంచనా వేస్తోంది. సీఎస్‌‌‌‌ఆర్ ప్రోగ్రామ్‌‌‌‌ల కోసం గతంలో కూడా బజాజ్ గ్రూప్‌‌‌‌ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది.   ‘గత పదేళ్లలో  రూ. 4 వేల కోట్లు వెచ్చించాం.

ముఖ్యంగా  యువత స్కిల్స్‌‌‌‌ పెంచడం,  ఎడ్యుకేషన్‌‌‌‌,  హెల్త్‌‌‌‌,  నీటి పొదుపుపై  ఖర్చు చేశాం’ అని బజాజ్ గ్రూప్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.  బజాజ్ ఇంజినీరింగ్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ ట్రెయినింగ్ (బెస్ట్‌‌‌‌) ప్రోగ్రామ్‌‌‌‌ 2023 లో లాంచ్ అయ్యింది. ఇంజినీరింగ్‌‌‌‌, డిప్లామా గ్రాడ్యుయేట్ల స్కిల్స్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్‌‌‌‌ను బజాజ్ గ్రూప్ తీసుకొచ్చింది.  ఇందుకోసం పూణెలో  అతిపెద్ద సెంటర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది.  

120 మంది స్టూడెంట్లు ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌‌‌‌ కింద చదువుతున్నారు.  దేశం మొత్తం మీద 15 సెంటర్లను ఏర్పాటు చేయాలని ఈ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌ తెచ్చిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌‌‌‌ సీపీబీఎఫ్‌‌‌‌ఐ కూడా యువత స్కిల్స్ పెంచడంలో సాయపడుతోంది. సీపీబీఎఫ్‌‌‌‌ఐతో దేశం మొత్తం మీద 53 వేల మందికి లబ్ది చేకూరిందని కంపెనీ పేర్కొంది.