40 ఏళ్ల గడువు​తో హౌసింగ్​ లోన్​.. ప్రకటించిన బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​

40 ఏళ్ల గడువు​తో హౌసింగ్​ లోన్​..    ప్రకటించిన బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​

హైదరాబాద్​, వెలుగు: సొంత  ఇల్లు కొనుక్కోవాలనే ఉద్యోగుల కోసం 40 ఏళ్ల టెనార్​తో హోమ్​లోన్లు ఇవ్వనున్నట్లు బజాజ్​ హౌసింగ్​ఫైనాన్స్​ప్రకటించింది. హోమ్​లోన్లకు  మాగ్జిమమ్​ టెనార్​ ఇప్పటిదాకా 30 ఏళ్లేనని తెలిపింది. ఇంటి రుణాలు ఇచ్చే కంపెనీలలో చాలా కంపెనీలు 30 ఏళ్ల టెనార్​కే లోన్లు ఇస్తున్నాయి. సొంత ఇల్లు కొనుక్కునే వారికి వెసులుబాటు కల్పించే ఉద్దేశంతోనే ఈ కొత్త టెనార్​ను తీసుకొచ్చినట్లు బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ పేర్కొంది. దీంతో రీపేమెంట్​విషయంలో వారికి మరింత ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుందని వివరించింది. 

తమ ఇంటి రుణాలపై రూ. లక్షకు నెలకు రూ. 733 ఈఎంఐ అవుతుందని బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ పేర్కొంది. హోమ్​లోన్​కు అప్లయ్​ చేసుకునే నాటికి ఆ వ్యక్తి వయసును బట్టి టెనార్​ వర్తిస్తుందని వివరించింది. 75 ఏళ్ల వయసు దాకా హోమ్​లోన్​ను తిరిగి చెల్లించే వీలు ఈ కొత్త 40 ఏళ్ల టెనార్​తో కలుగుతుందని పేర్కొంది.  ఈ కంపెనీ హోమ్​లోన్లపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. టెనార్​పెంపుదల వల్ల ఈఎంఐలు తగ్గినప్పటికీ, హోమ్​లోన్​ ఇచ్చే కంపెనీలకు తిరిగి చెల్లించే మొత్తం బాగా ఎక్కువే అవుతుందనేది దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.