
హైదరాబాద్, వెలుగు: బజాజ్ ఆటో లిమిటెడ్, కార్గో, ప్యాసింజర్ త్రీ వీలర్ ఆటోల కోసం హైదరాబాద్‌లో తమ కొత్త డీలర్ షిప్ ను ఉప్పల్ భగాయత్ వద్ద శ్రీ వినాయక బజాజ్ పేరుతో ప్రారంభించింది. ఈ డీలర్ షిప్ ను అన్షుల్ చోప్రా (వీపీ సేల్స్ , ఐబియూ), వర్క్ షాప్ ను అనుపమ్ శ్రీవాస్తవ (వీపీ - సర్వీస్ , ఐబీయూ) ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో అన్ని రకాల ఆటోలు అందుబాటులో ఉంటాయని బజాజ్తెలిపింది. ఈ డీలర్ షిప్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బజాజ్ ఆర్ఈఈటెక్9.0ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.