ప్రీతి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

 ప్రీతి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

సీనియర్ల ర్యాగింగ్ భూతానికి బలైన ధరావత్ ప్రీతి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ మెడికల్ కళాశాల వైఫల్యం వల్లనే ప్రీతి మృతి చెందిందని బజరంగదళ్ నాయకులు కూకట్పల్లి వై జంక్షన్ లో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్దం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రీతి ఫిర్యాదు చేసిన సమయంలో వైద్య కళాశాల సిబ్బంది, పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆరోపించారు. స్థానిక నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు పోలీసులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని వారి విధులను నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కళాశాలలో ఇదే తంతు కొనసాగుతుందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన బుద్ధిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని బజరంగదళ్ నాయకులు హెచ్చరించారు.