వాలెంటెన్స్ డే గ్రీటింగ్ కార్డ్స్‌ దహనం చేసిన బజరంగ దళ్

వాలెంటెన్స్ డే గ్రీటింగ్ కార్డ్స్‌ దహనం చేసిన బజరంగ దళ్

విదేశీ సంస్కృతి అయిన వాలెంటైన్స్ డే ను  ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని బజరంగ దళ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్  కోఠీ ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో బజరంగ దళ్ ఆధ్వర్యంలో వాలెంటెన్స్ డే గ్రీటింగ్ కార్డ్స్ ను దగ్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటెన్స్ డే ను నిరసిస్తూ బజరంగ దళ్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇలాంటి సంస్కృతిని వ్యాపారస్తులు కూడా ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. వాలెంటెన్స్ డే రోజు జరుపుకునే వారికి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఉంటుందని హెచ్చరించారు.