
వైవిధ్యమైన పాత్రలతో, తనదైన కామెడీ టైమింగ్‌తో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తున్న ప్రవీణ్.. ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్‌జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ‘ఐదుగురు బ్యాచిలర్స్ లైఫ్‌లోకి ఓ తిండిపోతు దెయ్యం వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్ర కథ. నేను పరమేష్ అనే పాత్రలో కనిపిస్తా.
నా పాత్రకు సంబంధించిన యాంబిషన్ ఎలా ఫుల్‌ఫిల్ అయింది అనే అంశంతో పాటు తిండిపోతు దెయ్యం పెట్టే ఇబ్బందుల నుంచి వచ్చే హాస్యం, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. హారర్, థ్రిల్లింగ్, మైథాలజీ అంశాలు కలగలిసిన కథ. నేను రెగ్యులర్‌గా చేసే కామెడీ రోల్స్‌కు భిన్నంగా ఎమోషన్ కూడా పండించాను.
ఓ మంచి స్నేహితుడు మన నుంచి వెళ్లిపోవాల్సి వస్తే మనలో ఉండే ఓపెయిన్‌ఫుల్ ఎమోషన్‌తో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. శిరీష్ గారు సినిమా చూసి మంచి కథను ఎంచుకున్నావంటూ ఎస్వీసీ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార చిత్రాల్లో నటిస్తున్నా’ అని చెప్పాడు.