కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో ఎస్‌జే శివ దర్శకుడిగా లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఆగస్టు 8న సినిమా విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ప్రవీణ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరేట్ యాక్టర్. తనకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.
ఎమోషన్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఇదని ప్రవీణ్ అన్నాడు. దర్శకుడు ఎస్ జే శివ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రమిది. చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. అందరిని కడుపుబ్బ నవ్విస్తుంది’ అని చెప్పాడు. ‘మా టీమ్ అంతా కలిసి మంచి డిష్‌ను ప్రిపేర్ చేశాం. ఈ డిష్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మా సినిమాను రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థ్యాంక్స్’ అని నిర్మాత జనార్థన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు సత్యం రాజేష్, షైనింగ్ ఫణి, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, డిఓపీ బాల సరస్వతి, సంగీత దర్శకుడు వికాస్ బడిస పాల్గొన్నారు.
