థ్రిల్‌‌‌‌‌‌‌‌ ఫీలవుతూనే నవ్వుకునేలా.. బకాసుర రెస్టారెంట్

థ్రిల్‌‌‌‌‌‌‌‌ ఫీలవుతూనే నవ్వుకునేలా.. బకాసుర రెస్టారెంట్

కమెడియన్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌జే శివ తెరకెక్కించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌’.  వైవా హర్ష టైటిల్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించాడు.  లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌‌‌‌‌‌‌‌ ఆచారి నిర్మించారు.  ఆగస్టు 8న సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ఎస్‌‌‌‌‌‌‌‌జే శివ మాట్లాడుతూ ‘నేను లండన్‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసి, ‘విరూపాక్ష’ చిత్రానికి పనిచేశాను. మా నాన్నగారు గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు.  ఆయన కల నెరవేర్చడం కోసం నేను దర్శకుడిగా, మా అన్నయ్య నిర్మాతగా మారాం. 

ఇక ఐదుగురు బ్యాచిలర్స్‌‌‌‌‌‌‌‌ జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయనేది ఈ చిత్రం ప్రధాన  కథ.  హారర్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌, కామెడీ, ఎమోషన్‌‌‌‌‌‌‌‌ అన్నీ ఉంటాయి.  హంగర్ కామెడీ అనే కొత్త జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాగే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. తిండిబోతు కథ నుంచి వచ్చే కామెడీ కనుక హంగర్‌‌‌‌‌‌‌‌ కామెడీ అంటున్నాం. 

ప్రేక్షకులకు వినోదం పంచడమే లక్ష్యంగా క్లీన్‌‌‌‌‌‌‌‌ కామెడీతో ఫ్యామిలీతో కలిసి చూసేలా తెరకెక్కించాం. యమలీల, ఘటోత్కచుడు చిత్రాల తరహాలో ప్రేక్షకులు థ్రిల్‌‌‌‌‌‌‌‌ అవుతూనే నవ్వుకునేలా ఉంటుంది. దిల్ రాజు గారు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.