
బలగం సినిమా ఈ మధ్య వచ్చిన సినిమాల్లోకెల్లా అత్యంత ప్రాచుర్య పొందిన సినిమా. పల్లెలు, పట్టణాలు అంటూ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న సినిమా అది. మనిషి మూలాలను, సంబంధాలను గురించి చెప్పిన కథాంశం.. ఈ బిజీ లైఫ్ లో ఉన్న జనరేషన్స్ ను సైతం ఆకర్శించింది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు జీవీ బాబు చనిపోయారు. మూత్ర పిండాల వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన.. వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (మే 25) ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ సినింమాలో ప్రియదర్శి చిన్నతాత అంజన్నగా నటించారు జీవీ బాబు.
నటుడు జీవీ బాబు మృతిపట్ల సంతాపం తెలిపారు బలగం మూవీ డైరెక్టర్ వేణు. ‘‘ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను’’ అని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
గత కొంత కాలంగా కడ్నీ సమస్యలతో బాధపడుతున్న జీవీ బాబు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. కిడ్నీ ఫెయిల్ అవ్వటంతో పాటు, గొంతుకి ఇన్‌ఫెక్షన్ రావడంతో నోట మాట కూడా రాని పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు. చాలా రోజులుగా ఆయనకు డయాలసిస్ చేస్తూ వస్తున్నారు.
ఆసుపత్రి బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న జీవీ బాబుకు బలగం డైరెక్టర్ వేణు, ఇతర నటులు ఆర్థిక సాయం చేశారు. డయాలసిస్ కు కావాల్సిన ఖర్చులు ఇచ్చి ధైర్యం చెప్పారు. రోజూ డయాలసిస్ చేసినప్పటికీ.. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే చనిపోయారు.
జి వి బాబు గారు ఇకలేరు🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 25, 2025
ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు..
చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది🙏🙏
అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 💐🙏#balagam #artist #stage #plays #natakam pic.twitter.com/fzDHReHt8g