Balagam: గ్రామాల్లో 'బలగం' ప్రదర్శనపై పోలీసులకు దిల్ రాజు కంప్లైంట్

Balagam: గ్రామాల్లో 'బలగం' ప్రదర్శనపై పోలీసులకు దిల్ రాజు కంప్లైంట్

తెలంగాణ పల్లెల్లోని బంధాలను, బంధుత్వాలను కళ్లకద్దేలా చూపించిన సినిమా 'బలగం'. టిల్లు వేణు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచే భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మనుషుల మధ్య సంబంధాలను, కుటుంబం గొప్పతనాన్ని చాటి చెప్పడంతో పలు గ్రామాల్లోనూ ఈ మూవీని తెరపై స్క్రీనింగ్ చేస్తు్న్నారు. దీంతో మారుమూల గ్రామాల్లో థియేటర్లకు వెళ్లలేని వాళ్లు సైతం ఈ సినిమా చూసి కనెక్ట్ అవుతున్నారు. తమ కుటుంబంలోనూ ఇలాంటి వాతావరణమే ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాత దిల్ రాజ్ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా తమ అనుమతి లేకుండా గ్రామాల్లో మూవీని చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పైరసీ యాక్ట్ కింద వెంటనే చర్చలు తీసుకోవాలని దిల్ రాజు ప్రొడక్షన్ టీమ్ కోరింది. ప్రస్తుతం ఈ పోలీస్ కంప్లైంట్ కు సంబంధించిన ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెంటిమెంట్ తో పాటు హాస్యాన్ని, మానవ బంధాలను, వాటి విలువలను చూపించిన బలగం సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. సినిమాలోని పిట్టె ముట్టడం అన్న అంశం ఈ మూవీలో ప్రధాన ఘట్టంగా ఉండడంతో ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఇంత మంచి సినిమాను తమ ఊర్లోనే ప్రదర్శన ఇవ్వడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమకు మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలే సినిమాను అందించినందుకు క-ృతజ్ఞతలు తెలియజేస్తు్న్నారు. కానీ నిర్మాత దిల్ రాజు ఇలా పోలీసు కంప్లయింట్ ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు.