బలగం నటుడు కన్నుమూత.. బాపూ అంటూ వేణు నివాళులు

బలగం నటుడు కన్నుమూత.. బాపూ అంటూ వేణు నివాళులు

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన బలగం(Balagam) సినిమాలో సర్పంచ్ పాత్రలో కనిపించిన నటుడు నర్సింగం(Narsingam) కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని బలగం చిత్ర దర్శకుడు, నటుడు వేణు ఎల్దండి(Venu yeldandi) తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సంధర్బంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. 

నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని చూసుకొని.. మీలోని కళాకారుడు తృప్తి చెందటం నేను అదృష్టంగా భావిస్తున్నాను.. ఓం శాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను. ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నాకోసం. అంటూ బలగం సినిమా రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు వేణు. ఈ విషయం తెలుసుకున్న పలువురు చిత్రబృందం సభ్యులు ఆయనకు సంతాపం ప్రకటించారు.