
స్వచ్ఛమైన ..అచ్చమైన పల్లె కథను తెరకెక్కించిన డైరెక్టర్ బలగం వేణు(Venu). ఈ మూవీతో ఇండస్ట్రీలో తనదైన సిగ్నేచర్ క్రియేట్ చేశాడు. బలగం మూవీలో చిన్ననాటి ఆటలు..యాసలోని మాటలు..కుటుంబంలో ఎన్ని కష్టాలు, బాధలున్నా..వారి పట్ల ఉండే మమకారాన్ని కళ్లకు కట్టినట్లు అద్భుతంగా తెరకెక్కించారు వేణు.
బలగం(Balagam) మూవీతో హిట్ అందుకున్న వేణు తాజాగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు. తనకు కూతురు పుట్టిందని తెలుపుతూ..ఫోటోలను షేర్ చేశారు. 'ఆడబిడ్డ జన్మించింది. ఇంతటి గొప్ప శుభవార్తను..నా ఇంతటి బలగమైన పెద్ద కుటుంబంతో పంచుకోవడం నాకు యెనలేని ఆనందాన్ని ఇస్తుందని..పోస్ట్ చేశారు. వేణు ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ వచ్చిందంటూ..సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బలగం వేణుకి ఇప్పటికే రేవంత్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడబిడ్డ జన్మించడంతో రెండోసారి తండ్రి అయ్యాడు.
Also Read : హై రెంజ్ డిమాండ్తో నయనతార.. అసలు తగ్గట్లేదట!
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చిన బలగం మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు..అంతర్జాతీయ అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ప్రస్తుతం వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కథాచర్చలు కూడా పూర్తయినట్లు టాలీవుడ్ టాక్.
బలగం మూవీ లో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ తో పాటు..ప్రతీ పాత్రకు నటీనటులు వందశాతం ప్రాణం పోశారు. బలగం సినిమాకు పాత్రలు ఒక ఎత్తు అయితే.. భీమ్స్ సంగీతం..సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు.