
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చేపేరు నయనతార (Nayanatara). నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ..హిట్స్ మీద హిట్స్ అందుకుంటోంది ఈ బ్యూటీ. దీంతో నయనతారకు బాలీవుడ్‌లోనూ క్రేజ్ పెరుగుతోంది.
ఇటీవల షారుక్ ఖాన్‌తో నయన్ జవాన్‌లో నటించింది. ఈ మూవీతో హిందీ ఆడియెన్స్‌ను సైతం మెస్మరైజ్ చేసింది. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ కొట్టడంతో ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ హీరోయిన్ కోసం క్యూ కట్టారట. దీంతో తన క్రేజ్‌కి తగ్గట్టే రెమ్యూనరేషన్‌ను కూడా భారీగా పెంచిందని టాక్.
జవాన్‌కు మూవీకి రూ.10 కోట్లు అందుకోగా తన నెక్ట్స్ సినిమాకు రూ.13 కోట్లు డిమాండ్ చేస్తోందట. అలాగే జీఎస్టీ ఛార్జీల కోసం అదనంగా మరో కోటి డిమాండ్ చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ హిందీలో నయనతార తరువాతి ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు.
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మూవీలో నయన్ చాన్స్ కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ మొత్తంలో రికార్డ్ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడం వల్ల నయన్ ఆస్తుల వివరాలు బానే పెరిగాయని సమాచారం. తన సొంత ఊరిలోనే కాదు హైదరాబాద్ లో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయట నయనతారకు. హైదరాబాద్ లో ఈ అమ్మడుకు రెండు లగ్జురియాస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయట. వాటి ఖరీదు ఒక్కోటి రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే..తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా డ్యూయల్ రోల్ లో కనిపించారు. షారుఖ్‌కు జోడీగా నయనతార, దీపికా పదుకొనే కనిపించగా..విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.