నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా : బాలకృష్ణ

నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా : బాలకృష్ణ

దేవ బ్రాహ్మణులపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణ క్షమాపణ కోరారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. ఎవరినీ బాధపట్టే ఉద్దేశం తనకు లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని తనకందిన సమాచారం తప్పని చెప్పిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. 

తన మాటల వల్ల వారి దేవ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధపడ్డానని, ఎవరినీ బాధపెట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. దేవాంగులతో తన అభిమానులు చాలా మంది ఉన్నారన్న బాలయ్య.. వాళ్లను తాను బాధపెట్టుకుంటానా అని అన్నారు. తనను అర్థం చేసుకుని పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.