రికార్డ్ కలెక్షన్స్తో దూసుకెళ్తున్న భగవంత్ కేసరి.. వంద కోట్ల దిశగా బాలయ్య

రికార్డ్ కలెక్షన్స్తో దూసుకెళ్తున్న భగవంత్ కేసరి.. వంద కోట్ల దిశగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

లేటెస్ట్ గా భగవంత్ కేసరి సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.71.02కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో..ఈ వీకెండ్ బాక్సాపీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. భగవంత్ కేసరి వరుస కలెక్షన్స్ చూసుకుంటే..మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రెండవ రోజు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ దాటేసి రూ .51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 

భగవంత్ కేసరి సినిమాతో మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోనున్నారు బాలయ్య. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వంద కోట్ల కొల్లగొట్టిన బాలయ్య.. వరుసగా మూడోసారి ఆ ఫీట్ ను సాదించనున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Also Read :- పుష్ప మేకర్స్ గ్రాండ్ పార్టీ

ఈ సినిమా గురించి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన బలమని..ఇవే విజయానికి కారణమని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఓ తండ్రికి బిడ్డకు మధ్య ఉండాల్సిన అందమైన భావోద్వేగానికి అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. ఆడపిల్లను సింహంలా పెంచాలనే మంచి సందేశం జనాల్లోకి తొందరగా వెళ్లింది.