జాతీయ అవార్డు గ్రహీతలకు .. పుష్ప మేకర్స్ గ్రాండ్ పార్టీ

జాతీయ అవార్డు గ్రహీతలకు .. పుష్ప మేకర్స్ గ్రాండ్ పార్టీ

టాలీవుడ్ స్థాయి.. తెలుగు రాష్ట్రాల నుంచి.. ప్రపంచ ఖ్యాతి అంచులను ముద్దాడుతుంది. RRR మూవీ మొన్నటికి మొన్న ఆస్కార్ కొల్ల‌గొట్టింది. గోల్డెన్ గ్లోబ్ కైవ‌శం చేసుకుంది. మరెన్నో హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాలు ద‌క్కాయి. ఆ త‌ర్వాత ఊహించని విధంగా మరిన్ని తెలుగు చిత్రాలు జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్నాయి. దీంతో  మ‌న తెలుగు సినిమా ప్ర‌తిభ విశ్వ‌విఖ్యాతం కావడంతో.. మేకర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

రీసెంట్ గా..69వ జాతీయ చలనచిత్ర అవార్డులు( National AwardS) గెలుచుకున్న పలు ఇండస్ట్రీ మేకర్స్ ను ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 సాయంత్రం ఢిల్లీలో  జ‌ర‌గిన  జాతీయ అవార్డుల కార్య‌క్ర‌మంలో..రాష్టపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా..అల్లు అర్జున్( Allu Arjun) జాతీయ ఉత్త‌మ న‌టుడిగా తొలి పుర‌స్కారాన్ని అందుకున్నారు. పుష్ప(Pushpa) అల్లు అర్జున్ నటనతో పాటు దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ కి సైతం ఈ అవార్డు వరించింది.  

Also Read :- యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్ జోరుగా హుషారుగా

అలాగే రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకోగా..మరోసారి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా, ఉత్త‌మ‌ నేపథ్య సంగీతం, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్‌లు, బెస్ట్ మెల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ లను  గెలుచుకుంది. దీంతో నిన్న (అక్టోబర్ 21 న ) జాతీయ అవార్డు విజేత‌ల‌కు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారతీయ సినిమాకు వందేళ్ల చరిత్ర ఉండగా.. అందులో తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర కలిగి ఉండటం మన ప్రత్యేకత. మన టాలీవుడ్ నుంచి ఎందరో స్టార్స్ వచ్చారు. మరెందరో తమ స్థానాలను ఇండస్ట్రీలో పదిల పరుచుకున్నారు. కానీ ఏ నటుడికి ఉత్తమ జాతీయ అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ది రైజ్‌' మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బన్నీకి ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరో కావడం విశేషం. పుష్ప మేకర్స్ గ్రాండ్ పార్టీలో.. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, ఉప్పెన బుచ్చిబాబు, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ, మారుతీ, నటుడు ప్రకాష్ రాజ్, ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.