BhagavanthKesari Day 1 Collections: భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

BhagavanthKesari Day 1 Collections: భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో వచ్చిన మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). ఈ మూవీలో శ్రీలీల(SreeLeela) కీలక పాత్రలో నటించి మెప్పించింది. డైరెక్టర్ అనిల్ ఆరు సినిమాలతో ఒక ఓవర్ పూర్తిచేసి.. భగవంత్ కేసరి చిత్రంతో సరికొత్త ఓవర్‌‌‌‌ను,‌‌‌‌ కొత్త ఇన్నింగ్స్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌  చేసి.. బాక్సాపీస్ వసూళ్లను క్రియేట్ చేస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా (అక్టోబర్ 19న) రిలీజ్ అయ్యి..థియేటర్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతుంది.

నందమూరి బాలయ్య ఫ్యాన్స్..ఎంతగానో ఎదురుచూసిన భగవంత్ కేసరి మూవీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. మరి ఆ అంచనాలను ఏ రేంజ్‌లో అందుకుందో తెలియాలంటే..భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాల్సిందే.

భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.32.33 కోట్లు వసూలు చేసి దసరా విజేతగా నిలిచినట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు మేకర్స్. కానీ బాలయ్య బాబు గత చిత్రం వీర సింహ రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే.. భగవంత్ కేసరి తక్కువనే చెప్పుకోవాలి. వీర సింహ రెడ్డి రూ.54.3 కోట్లతో బాలకృష్ణ కెరీర్ లోనే టాప్లో నిలిచింది. 

భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే..

బాలకృష్ణ రేంజ్‌కు తగినట్లు బిజినెస్ జరిగిందనే చెప్పుకోవాలి. రెండు  తెలుగు రాష్ట్రాల్లో రూ. 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. వాటిలో నైజాం ఏరియా నుంచి రూ. 14. 50 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరు నుంచి రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరు నుంచి రూ. 2.6 కోట్లుగా ఉన్నాయి. అలాగే, కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాల్లో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 6 కోట్ల బిజినెస్ అయింది. దీంతో వరల్డ్ వైడ్‌గా భగవంత్ కేసరి మూవీకి రూ. 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. 

భగవంత్ కేసరి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కు తగినట్లుగానే.. రూ.68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ఉండటంతో.. చాలా తక్కువని భావించారు. కానీ, ఫస్ట్ కలెక్షన్స్ వచ్చాక.. బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకో 2 రోజులు సమయం పట్టె అవకాశం కనిపిస్తోంది. 

భగవంత్ కేసరి వరల్డ్ వైడ్‌గా సుమారు 1350 థియేటర్లలో రిలీజై అయింది. దీనికి మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్.. కానీ, వీర సింహారెడ్డి మూవీతో పోలిస్తే.. భగవంత్ కేసరి సినిమాకు కాస్తా స్లోగా బుకింగ్స్ స్టార్ట్ అవ్వటం వల్ల..తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రేంజ్‌లో బుకింగ్స్ జరిగాయి.

అయితే, భగవంత్ కేసరికి లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండటంతో..తర్వాతి రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం, రానున్న రోజులు పండుగ సెలవులు కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.