బాలకృష్ణ భగవంత్ కేసరి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

బాలకృష్ణ భగవంత్ కేసరి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటించారు. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణ కూతురిగా కీ రోల్ లో కనిపించారు. 

దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. కేవలం నాలుగు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. తాజాగా భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్‌ 24 నుండి ఓటీటీలో స్ట‍్రీమింగ్ కానుంది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను దక్కించుకుంటుందో చూడాలి.