మలయాళ చిత్రం 'మంజుమ్మేల్ బాయ్స్' తెలుగులోనూ మెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు చిదంబరం నుంచి వస్తున్న తాజా సినిమా 'బాలన్: ది బాయ్' ఫహద్ ఫాజిల్తో తో 'ఆవేశం' తీసిన జితూ మాధవన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ను అందించాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యాన ర్పై వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మించారు.
ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ చిత్రం జూన్ 19న పాన్ ఇండియా వైడ్గా విడుదల కాబోతోంది. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. ఓ చిన్న పిల్లాడు, అతని తల్లి చుట్టూ జరిగే కథ ఇది. ఫర్జానా పలతింగల్, మాస్టర్ ఆదిశేషన్ తల్లికొడుకుగా నటించారు. “అమ్మా.. మన కొత్త కథ ఏమిటి.. నా కొత్త పేరు ఏమిటి" అని పిల్లాడు అడిగే డైలాగ్స్ తో సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు.
తమ ఒరిజి నల్ ఐడెంటిటీని దాచి ఊరుకో పేరు మారుస్తూ ఆమె ఎందుకు తన గతాన్ని దాచాలనుకుంటోం ది. తుపాకీతో ఆమె ఎవరిని హత్య చేసింది.. ఆ పిల్లాడు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉన్నాడు.. వాళ్ళిద్దరి జీవితంలో ఏం జరిగింది.. పోలీసుల విచా రణలో ఏం తేలింది.. అనే అంశాలతో ఆసక్తికరంగా ట్రైలర్ కట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
