
మాదాపూర్ కాల్పుల కేసులో కొత్త కోణం బయటపడింది. తాడ్ బండ్ లో 250 గజాల ల్యాండ్ తో ఇస్మాయిల్-ముజాహిద్ మధ్య వివాదం మొదలైంది. కొద్ది రోజుల కిందటే ముజాహిద్దీన్ పేరుతో ఇస్మాయిల్ గిప్ట్ డీడ్ చేశారు . స్థల వివాద పరిష్కారం కోసం ఇస్మాయిల్ ను మహ్మద్ అలియాస్ షేక్ ముజాహిద్ మాదాపూర్ పిలిచాడు. ఇస్మాయిల్, మహ్మద్ మాట్లాడుకుంటుండగా జిలానీ కాల్పులు జరిపాడు . జిలానీ మహ్మద్ రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. ఇస్మాయిల్ పై జిలానీ ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు . తీవ్ర గాయాలతో ఇస్మాయిల్ ప్రాణాలు కోల్పోయాడు.
పరారీలో నిందితులు
బాలానగర్ డీసీపీ సందీప్ రావు వివరాల ప్రకారం.. నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇస్మాయిల్, ముజాహిద్ ఇద్దరు కలిసి సిటీలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో మాదాపూర్ నీరూస్ వద్ద ఇస్మాయిల్ పై గన్ తో కాల్పులు జరిపారు. ఆ సమయంలో జాంగీర్ పక్కనే ముజాహిద్ ఉన్నాడు. ఇస్మాయిల్ తో పాటు మరో మిత్రుడికి గాయాలు అయ్యాయి. గతంలో ఇద్దరిపై అనేక కేసులు ఉన్నాయి. రెండు నుండి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో ఇస్మాయిల్ స్పాట్ లోనే మృతి చెందాడు. జాంగీర్ పై కూడా కాల్పులు జరపడంతో గాయాలై ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు’ అని పోలీసులు తెలిపారు.
నేను అడ్డుకోవడానికి వెళ్తే నాపై కాల్పులు జరిపారు
ల్యాండ్ సెటిల్మెంట్ డబ్బులకు పిలిచారని కాల్పుల్లో గాయపడ్డ జాంగీర్ తెలిపాడు. ‘ మాదాపూర్ లోని ఇడ్లీ బండి దగ్గర రాత్రి 3: గంటల ప్రాంతంలో టిఫిన్ చేశాం. ఇస్మాయిల్, అహ్మద్ ముజాహిద్ గొడవ కాస్త పెద్దగా అయింది. జిలాని వెంట తెచ్చుకున్న గన్ తో ఇస్మాయిల్ పై కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ పైన జిలాని అతని అనుచరులు కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ తల వెనుక రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. నేను అడ్డుకోవడానికి వెళ్తే నాపై కూడా కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ కింద పడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో నేను కార్లో హాస్పిటల్ కు పంపించాను. జహీరాబాద్ కు సంబంధించిన మూడు ఎకరాల ల్యాండ్ పై ఇస్మాయిల్ అతని స్నేహితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ల్యాండ్ జిలాని పేరుమీద ఇస్మాయిల్ రిజిస్ట్రేషన్ చేయించాడు . అప్పటినుండి వీరిద్దరి మధ్య భూ వివాదం మొదలయ్యింది. ఒప్పందం ప్రకారం జిలాని ఉండకుండా.. మాట మార్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇస్మాయిల్, మహ్మద్ ముజాహిద్ లకు జైల్లో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరి పైన గతంలోనే రౌడీషీట్ ఉంది’ అని చెప్పాడు.