
- అవినీతికి పాల్పడడంతో సైబరాబాద్ సీపీ చర్యలు
కూకట్పల్లి, వెలుగు: అవినీతికి పాల్పడిన బాలానగర్ ఎస్సై రామ్నారాయణను సైబరాబాద్సీపీ అవినాష్మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇతనిపై అవినీతి ఆరోపణలతోపాటు పలు సందర్భాల్లో బాధితులపై చెయ్యి చేసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. పలు కేసుల్లో డబ్బు డిమాండ్ చేయడంతో బాధితులు నేరుగా సైబరాబాద్ సీపీ అవినాష్మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మహిళ విషయంలో బాధితులను కొట్టారు. ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపారు. ఎస్సై రామ్నారాయణ బాధితులపై చెయ్యి చేసుకోవడంతోపాటు అతనిపై ఉన్న అవినీతి ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలింది. దీంతో ఎస్సైను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.