పేరుకే బ్రాండెడ్.. ​టీవీలు మాత్రం డూప్లికేట్

పేరుకే బ్రాండెడ్.. ​టీవీలు మాత్రం డూప్లికేట్
  • రెండు ఎలక్ట్రానిక్ షాప్ లపై బాలానగర్ ఎస్ వోటీ దాడులు
  • రూ.46.20లక్షల 154 ఎల్ఈడీలు స్వాధీనం
  • ఇద్దరు వ్యాపారులు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: టీవీల విడిభాగాలతో ఎల్ఈడీలను తయారు చేసి వాటికి బ్రాండెడ్ కంపెనీల ట్యాగ్ లు, స్టిక్కర్లు, లోగోలు అటాచ్ చేసి అమ్ముతున్న రెండు ఎలక్ట్రానిక్స్ షాప్ లపై బాలానగర్ ఎస్ వోటీ జోన్, జీడిమెట్ల పోలీసులు దాడులు చేసి ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వీరు ఇతర రాష్ట్రాలకు సైతం డూప్లికేట్ టీవీలను బ్రాండెడ్ కంపెనీల పేరుతో సప్లయ్ చేసి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ దాడుల్లో రూ.46లక్షల20 వేలు విలువ చేసే వివిధ కంపెనీలకు చెందిన 154 ఎల్ఈడీలను స్వాధీనం చేసుకున్నారు.   పోలీసుల క థనం ప్రకారం…  జీడిమెట్ల సుభాష్​నగర్​ కృష్ణమూర్తినగర్​కి చెందిన బాలమురుగన్​ సుబ్రమణ్యం అలియాస్​  బాలు (39), కొంపల్లి గార్డెన్​ హౌజింగ్​ సోసైటీ లోని లిల్లి అపార్ట్​ మెంటులో ఉండే  హసమ్ హసన్ పర్మార్(65) ఇద్దరు షాపూర్​నగర్​లోని మార్కెట్​లో మహశక్తి ఎలక్ర్టానిక్స్​ , హెచ్​.ఎన్​. ఎలక్ట్రానిక్స్ పేరుతో  పక్క పక్కనే దుకాణాలు నిర్వహిస్తున్నారు.  20 ఏండ్లుగా ఈ ఇద్దరు  అమాయక వినియోగదారులే లక్ష్యంగా డూప్లికేట్​ టీవీలను అమ్ముతున్నారు.  డూప్లికేట్​ టీవీలలో సాఫ్ట్​ వేర్​లు వేసి  ప్రముఖ బ్రాండ్​లైన సోనీ, ఎల్​జీ, సామ్​సంగ్​, ఐవా, తోషిబా బ్రాండ్​ పేర్ల లోగోలు, స్టిక్కర్​​లను  తగిలించి  అమ్ముతున్నారు.  కేవలం షాపూర్​నగర్​లోనే కాకుండా దేశంలోని తమిళనాడు, కేరళ, గుజరాత్​ రాష్ట్రాలకు  ఈ టీవీలను సప్లయ్ చేస్తున్నారు.

  ఈ విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు, బాలానగర్​ ఎస్ వోటీ అధికారులు ఆదివారం సాయంత్రం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.46.20లక్షల విలువచేసే 154 ఎల్​ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 32 ఇం​చెస్​ టీవీలు 79,  24 ఇం​చెస్​టీవీలు 15, 40 ఇం​చెస్​ టీవీలు 54,  50 ఇం​చెస్​  4, 55ఇం​చెస్​ 2 ఉన్నాయి. వీటితోపాటు సోని, ఎల్​జీ, సామ్​సంగ్​, సాన్​సూయి, తోషిబా, ఐవా, సన్​రైజ్​, హైవా, తామ్​సన్​, జేబీఎల్​ స్టికర్​లు, 7 ప్రోగ్రామింగ్​ పెన్​డ్రైవ్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యాపారులు బాలమురుగన్, హసన్ ను అరెస్ట్ చేశారు.  ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించిన బాలానగర్​ ఎస్​ఓటీ జోన్​ ఇన్​స్పెక్టర్​ సుధీర్​,ఎస్​ఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సంజీవ్​, హెచ్​సీ రాజు, పీసీ ముకుందం, బాలానగర్​  సీఐ రమణారెడ్డి,ఎస్సై విశ్వనాథ్​, ఎస్​ఓటీ స్టాఫ్​ నర్సిరెడ్డి, నర్సింహ, శ్రీనివాస్​రెడ్డికి అవార్డు కోసం రికమండ్​ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.