బ్యాలెన్స్​డ్​ ​ డైట్​ ఫాలో కావాలంటే...

బ్యాలెన్స్​డ్​ ​ డైట్​ ఫాలో కావాలంటే...

బ్యాలెన్స్​డ్​ ​ డైట్​ ఫాలో కావాలంటే ఈ సూపర్​ ఫుడ్స్​ని తినాలి. అవేంటో చెప్తున్నారు రోజ్​వాక్​ హెల్త్​ కేర్​, న్యూట్రిషనిస్ట్​ రాశి చాహల్. 

  • కర్బూజ(మస్క్​ మెలన్​) గింజల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. నిజానికి అవి కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. వాటిల్లో విటమిన్​–ఎ, సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. నియాసిన్​, జింక్​, మెగ్నీషియం కూడా ఎక్కువే. ఈ గింజలు రోజూ తింటే లో బ్లడ్​ ప్రెజర్​​ సమస్య నుంచి బయటపడొచ్చు. వీటిలో ఉండే క్యాల్షియం, ప్రొటీన్...ఎముకలు, గోళ్లని బలంగా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఈ గింజల పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే యాంగ్జైటీ, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. 
  • వాటర్​ చెస్ట్​నట్స్​.. వీటినే సింఘోడా అని కూడా అంటారు. ఈ ఫ్రూట్​లో డైటరీ ఫైబర్​ ఎక్కువ. పొటాషియం, మాంగనీస్​, విటమిన్​– బి6, రిబోఫ్లేవిన్​, కాపర్, విటమిన్​– బి6 కూడా పుష్కలం. ఇమ్యూనిటీ బూస్టర్స్​లా పనిచేసి రకరకాల ఇన్ఫెక్షన్స్​తో​ పోరాడతాయి. ఒక టీ స్పూన్​ సింఘోడా పొడిని, నిమ్మరసంలో కలుపుకుని  తాగితే తామర లాంటి అలర్జీలు తగ్గుతాయి.
  • వేగించిన శనగపిండి ఇన్​స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. మెటబాలిక్​ రేటుని పెంచి, శరీరంలోని అదనంగా ఉన్న ​కేలరీలని కరిగిస్తుంది. ఈ పిండిలో ఉండే ఇన్​సాల్యుబుల్​ ఫైబర్ పేగుల్ని శుభ్రపరుస్తుంది. కడుపులో మంట, ఇరిటేషన్​ని తగ్గిస్తుంది.ఉసిరిలో ఉండే క్రోమియం అనే మైక్రోన్యూట్రియెంట్​ రక్తంలోని షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​ చేస్తుంది. 
  • సాధారణ ఉప్పుకి బదులు ఫోర్టిఫైడ్​ ఉప్పు తింటే శరీరానికి సరిపడా జింక్​ అందుతుంది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రిలీఫ్​ ఇస్తుంది. ఇమ్యూనిటీ పెంచి శరీరానికి  ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తుంది. 
  • కేలరీలు తక్కువ, ఫైబర్​ ఎక్కువగా ఉండే స్టార్​ ఫ్రూట్​ని డైట్​లో చేర్చాల్సిందే. ఇది ఇన్సులిన్, గ్లూకగోన్​ని బ్యాలెన్స్​ చేసి బ్లడ్​లోని గ్లూకోజ్​ లెవల్స్​లో హెచ్చు, తగ్గులు లేకుండా చూస్తుంది. ఈ ఫ్రూట్​లోని సాల్యుబుల్​ ఫైబర్​ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్​ని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్​ని, బ్లడ్​లోని ఫ్యాట్​ని తీసేస్తుంది. గుండె జబ్బుల్ని దరిచేరనివ్వదు. ఇందులో విటమిన్​– సి, బి– కెరటిన్​ లాంటి నేచురల్​ యాంటీ ఆక్సిడెంట్స్​ ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సాయపడతాయి.