బైబై గణేశా: బాలాపూర్ గణేషుడి నిమజ్జనం పూర్తి

 బైబై గణేశా: బాలాపూర్ గణేషుడి నిమజ్జనం పూర్తి

బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నంబర్ 13 దగ్గర బాలాపూర్ గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు బాలాపూర్ ఆలయ  కమిటీ చైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి,  ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం వినాయకుడిని నిజమజ్జనం  చేశారు  అధికారులు.   గణపయ్యకు వీడ్కోలు చెప్పేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి దాదాపు 20 కి.మీటర్లకు పైగా శోభాయాత్ర కొనసాగింది. 

హుస్సేన్ సాగర్ దగ్గర   గణేష్ నిమ్మజ్జనంతో  కోలాహాలంగా  మారింది.    నిమజ్జనానికి హుస్సేన్  సాగర్ కు క్యూ కట్టాయి వినాయకులు.  నవరాత్రులు పూజలందుకన్న వినాయకులను చూసేందుకు  భక్తులు భారీగా తరలివస్తున్నారు. ట్యాంక్ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయింది. ఇక అన్ని ఏరియాల నుంచి  వినాయకులు నిమజ్జనానికి బయల్దేరాయి.  

 ఈ సారి  బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రికార్డ్ సృష్టించింది.  ఈ సారి రూ.27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.  గతేడాది బాలాపూర్ లడ్డు ధర రూ.24.60 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది.