
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వీధుల్లోని మండపాలలో గణనాథుడిని ప్రతిష్టించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. బాలాపూర్లో 18 అడుగుల ఎత్తు,16 అడుగుల వెడల్పుతో మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పంచముఖ నాగేంద్రుడిపై కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నాడు బాలాపూర్ గణేషుడు.
ALSO READ: సిరిసిల్ల యువతి అద్భుత ప్రతిభ.. పెన్సిల్ లిడ్పై గణేష్ ప్రతిమ
పదిరోజుల పాటు కష్టపడి విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం థీమ్ లో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బాలాపూర్ వినాయకుడికి తొలిపూజ జరగనుంది. ధూల్పేట్లో లక్ష్మీనరసింహా కళాకారులతో బాలాపూర్ గణేషుడి విగ్రహం తయారీ చేయించారు నిర్వాహకులు.
ఉదయం నుండి బాలాపూర్ గణపతి ని చూసేందుకు తరలివస్తున్న భక్తులు. హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే గుర్తోచ్చే వాటిలో బాలాపూర్ కూడా ఒకటి. గతేడాది వేలం పాటలో 24 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డు కొనుగోలు అయింది.