సిరిసిల్ల యువతి అద్భుత ప్రతిభ.. పెన్సిల్ లిడ్పై గణేష్ ప్రతిమ

సిరిసిల్ల యువతి అద్భుత ప్రతిభ.. పెన్సిల్ లిడ్పై గణేష్ ప్రతిమ

అసాధారణ ప్రతిభతో కళాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది సిరిసిల్లకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ చెన్నోజు ప్రియాంక. వినాయక చవితి సందర్భంగా పెన్సిల్ పై చెక్కిన గణేష్ బొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్న నాటి నుంచే చాక్ పీస్ లపై, పెన్సిల్స్ లిడ్ పైన సూక్ష్మ కళాకృతులను తయారు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది ప్రియాంక.

సిరిసిల్ల విద్యానగర్  కు చెందిన స్వర్ణకారుడు చెన్నోజు వెంకటస్వామి కూతురు ప్రియాంక పదవ తరగతి నుంచి ఈ కళను ప్రాక్టీస్ చేస్తోంది.. ప్రతి పండుగకు పెన్సిల్ లిడ్ పై ఏదో ఒక సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేస్తోంది. హైదరాబాద్ లో ఎంసీఏ చదువుతున్న ప్రియాంక.. పెన్సిల్ లిడ్ కళాఖండాలతోపాటు వాల్ పేయింటింగ్స్ లో కూడా ప్రతిభను చూపుతూ కాలేజీలో ఎన్నో అవార్డులు అందుకుంది.