షుగర్ తో పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందా..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

షుగర్ తో పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందా..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్రపంచ వ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. షుగర్ తో పాటు గుండెజబ్బులు, జీవక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీటికి  మించి దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు పరిశోధకులు. వాటిలో పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గడం కూడా ఉందంటున్నారు. ఇటీవల జరిపిన సమీక్షలు, మెటా విశ్లేషణలో పరిశోధకులు.. డయాబెటిస్, పురుషుల్లో సంతాన లేమికి  మధ్య సంబంధంపై ఓ అంచనాకు వచ్చారు.దీర్ఘకాలిక డయాబెటిస్ తో పురుషుల్లో సంతాన సామర్థ్యం దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువకులు , పునరుత్పత్తి వయస్సు గల వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. 

డయాబెటిస్ రకాన్ని బట్టి.. 

PRISMA- గైడెడ్ మెథడాలజీని ఉపయోగించి పరిశోధకులు 350 కంటే ఎక్కువ అధ్యయనాలను సమీక్షించారు.  టైప్ 1 డయాబెటిస్ (T1D) ,టైప్ 2 డయాబెటిస్ (T2D) లో పురుషుల వంధ్యత్వాన్ని పరిశీలించేందుకు 17 అధ్యయనాలు చేశారు. మెటా-విశ్లేషణ షుగర్ ఉన్న పురుషులలో వంధ్యత్వ ప్రమాదంలో గణనీయమైన పెరుగుదలను చూశారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లలో ఈ ప్రభావం అధికంగా ఉందని పరిశోధనలు సూచించాయి.

Also Read : రోజు ఉదయం లేవగానే నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?

షుగర్ పేషెంట్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం ఉందా లేదా అని నిర్ధారించేందుకు ఇన్ ఫ్లేషన్ బేస్డ్ స్టడీస్,ట్రాన్స్క్రిప్టోమిక్ డేటాను కూడా విశ్లేషించారు. ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్-ఆల్ఫా (TNF-α)తో సహా పెరిగిన వాపు బయోమార్కర్లు ..షుగర్ పేసెంట్ల వ్యంధత్వంలో ప్రభావం చూపే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చారు. 

ఈ మెటా-విశ్లేషణలో షుగర్ టెస్టు విధానాల ద్వారా పురుషుల సంతానోత్పత్తిని ప్రతికూల ప్రభాశం ఉంటుందని ఆధారాలను బలపర్చాయి. ముఖ్యంగా T2D  వ్యాధిగ్రస్తులలో ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేశాయి.