పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేంద్రం అన్ని అనుమతులివ్వాలి: అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేంద్రం  అన్ని అనుమతులివ్వాలి: అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం

హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం అన్ని అనుమతులు ఇవ్వాలని తీర్మానం చేసింది. అలాగే గోదావరి జలాల తరలింపునకు ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేసింది. శనివారం (జనవరి 3) అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంపై ప్రభుత్వం చర్చ నిర్వహించింది. 

Also Read : అసెంబ్లీలో కేసీఆర్ పై అతడు సినిమా స్టోరీ చెప్పిన రేవంత్

ఈ సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కృష్ణా జలాల అంశంపై సుదీర్ఘంగా చర్చించి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని క్షుణ్ణంగా వివరించారు. అనంతరం 2026, జనవరి 5వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు స్పీకర్.