బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటే… లక్కు చిక్కినట్టే

బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటే… లక్కు చిక్కినట్టే

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటే… లక్కు చిక్కినట్టే. ఇది భక్తుల నమ్మకం. ఈ సెంటిమెంట్ తోనే లక్షలు పెట్టైనా బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకోవాలని చూస్తారు భక్తులు. ధర ఎంతైనా సరే లడ్డూ దక్కితే చాలు… ఏడాదంతా కలిసి వస్తుందని నమ్ముతారు. అందుకే సిటీకి చెందిన బడా వ్యాపారవేత్తలు.. పెద్ద సంఖ్యలో బాలాపూర్ లడ్డూ కోసం పోటీపడతారు. ఈ లడ్డూ అర్రాస్ పాట దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

బాలాపూర్ లడ్డు ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ఎక్కువ ధర పలికింది. 2018లో రూ.16.60 లక్షలు పలికిన లడ్డు.. ఈ సారి  రూ. 17.60 లక్షలకు కు దక్కించుకున్నారు. 2019కి బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు సిల్వర్ జూబ్లీ కావడంతో వేలంపై ఆసక్తి నెలకుంది. పోటాపోటీగా వేలం వేశారు. 25 సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డుకు క్రేజ్ తగ్గడంలేదు. ప్రారంభంలో వెయ్యిలోపు పలికిన లడ్డు ప్రసాదం.. ఇప్పుడు 17 లక్షల దాటింది. బాలాపూర్ లడ్డూ 25 సంవత్సరాల వేలం పాట వివరాలు ఇలా ఉన్నాయి.

25 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు వేలం వివరాలు

1994లో కొలను మోహన్ రెడ్డి – రూ. 450

1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500

1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ .18,000

1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000

1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000

1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000

2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000

2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000

2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000

2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000

2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000

2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000

2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000

2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000

2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000

2009లో సరిత -రూ.5,10,000

2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000

2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000

2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000

2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000

2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000

2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000

2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000

2017 నాగం తిరుపతిరెడ్డి- రూ. 15. 60 లక్షలు

2018 లో శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు

2019 రూ. 17.60 లక్షలకు కొలన్ రాంరెడ్డి దక్కించుకున్నారు. ఈ లడ్డూ బరువు 21 కిలోలు.