కుత్బుల్లాపూర్ పరిధిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్..

కుత్బుల్లాపూర్ పరిధిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్..

శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతపై భరోసా కల్పించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు..  బాలాపూర్ జోన్ సీడీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని శాపూర్ నగర్, గాజుల రామారం, రొడామిస్త్రి నగర్ ప్రాంతాల్లో జరిగిన ఫ్లాగ్ మార్చ్ అన్ని పీఎస్ ల పోలీసులు పాల్గొన్నారు. 

Also Read:ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు

ఈ సందర్భంగా బాలాపూర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.