ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు.. రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు.. రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ

ఢిల్లీ ద్వారకాలోని రామ్ లీలా  మైదానంలో మంగళవారం ( అక్టోబర్ 24) సాయంత్రం జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన రావణ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న  బీజేపీ  నాయకుడు పర్వేష్ వర్మ మాట్లాడుతూ... ప్రధాని ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. రావణ దహన కార్యక్రమానికి హాజరైన మోడీకి  నిర్వాహకులు రామ్​ దర్బార్​ విగ్రహంతో ఘనస్వాగతం పలికారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలు పోషించి వేదికపై రామ్​లీలా ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు మోదీ హారతులిచ్చారు.పండుగ వేడుకలకు గుర్తుగా రావణుడు, మేఘనాద్ , కుంభకర్ణల భారీ దిష్టిబొమ్మలను దహనం  చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి( దసరా)  జరుపుకుంటారు. రాముడు ...రావణుడిని దసరా పండుగ రోజే సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి.  ఈ నమ్మకంతో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసే సంస్కృతి సంప్రదాయాలను హిందువులు పాటిస్తారు. 

 విజయదశమి రోజున భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ చేస్తారని  ప్రధాని మోడీ అన్నారు. వెల్లడించారు. విశ్వమానవ సంక్షేమం కాంక్షిస్తూ దసరా వేళ శక్తిపూజ చేస్తామని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని వివరించారు. అయోధ్యలో సుదీర్ఘకాలం తర్వాత రామమందిరం నిర్మాణం జరుపుకుంటుండడాన్ని చూడడం మన అదృష్టమని పేర్కొన్నారు. రామ మందిరం నిర్మాణం మన సహనానికి దక్కిన విజయం అని అభివర్ణించారు.