బాలయ్య మాసివ్ మూమెంట్స్తో జాజికాయ సాంగ్.. అఖండ 2 సెకండ్ అప్డేట్

బాలయ్య మాసివ్ మూమెంట్స్తో జాజికాయ సాంగ్.. అఖండ 2 సెకండ్ అప్డేట్

బాలకృష్ణ, సంయుక్త మీనన్ జోడీగా నటిస్తున్న ‘అఖండ 2 : తాండవం’ చిత్రం నుంచి సెకండ్ సాంగ్‌‌ అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్.  ‘జాజికాయ’ అంటూ సాగే పాటను మంగళవారం (నవంబర్ 18) విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

 వైజాగ్ జగదాంబ థియేటర్‌‌‌‌లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమానికి  బాలకృష్ణతో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొంటారని,  తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌‌ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్‌‌‌‌గా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు.  గ్రాండ్ సెట్‌‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌‌లో బాలయ్య మాసివ్  డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌‌ని అలరించనున్నాయని అన్నారు. 

 ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో బాలయ్య, సంయుక్త జంట ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదల చేసిన  ‘హరహర మహాదేవ’ పాటకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ పాటపై క్యూరియాసిటీ పెరిగింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.  ఆది పినిశెట్టి,  హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. డిసెంబర్ 5న  టూడీ, త్రీడీ ఫార్మాట్‌‌లలో వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.