అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా.. కొనసాగుతున్న కూల్చివేతలు  

అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా.. కొనసాగుతున్న కూల్చివేతలు  

హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారుల కొరడా ఝులిపిస్తున్నారు. రోడ్డు, ఫుట్ ఫాత్ లపై నిర్మించిన అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నారు. గోశామహల్ నియోజకవర్గం పరిధిలోని బేగం బజార్ లో ఫుట్ పాత్ పై షెడ్ నిర్మించారు. దీంతో స్థానికులకు ఈ విషయాన్ని బల్దియా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమంగా నిర్మించిన షెడ్ ను క్రేన్ సహాయంతో తొలిగించారు బల్దియా అధికారులు. 

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సిటీతోపాటు HMDA పరిధిలో అక్రమనిర్మాణాలపై దృష్టి సారించారు హైడ్రా అధికారులు..పాతబస్తీలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలను బుధవారం ఆగస్టు 14, 2024 న తొలగించారు. బండ్లగూడలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు హైడ్రా అధికారులు.