వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న బాలినేని ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామాను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపించారు బాలినేని. వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాల కారణంగా రాజీనామా చేసిన బాలినేని త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రాజీనామా లేఖను జగన్ కు పంపిన బాలినేని.. లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని అన్నారు.రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అని.. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించానని అన్నారు. రాజకీయాల్లో బాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలని పేర్కొన్నారు.
రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. విలువలను నమ్ముకొని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, రెండుసార్లు మంత్రిగా పనిచేశానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేశానని అన్నారు బాలినేని.