అందరి ముందే ఆప్ ఎమ్మెల్యేను కొట్టిన భర్త

అందరి ముందే ఆప్ ఎమ్మెల్యేను కొట్టిన భర్త

పంబాబ్ రాష్ట్రంలో ఆప్ ఎమ్మెల్యే బల్దిందర్ కౌర్ పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. దాదాపు రెండు నెలల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. సమీపంలో రికార్డైన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం దారుణమని, పురుషుల ఆలోచన ధోరణి మారాలని పోస్టులో పేర్కొన్నారు. పంజాబ్ మహిళా కమిషన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా పరిగణిస్తూ.. చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే.. ఎమ్మెల్యే బల్దిందర్ కౌర్ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. 

పంజాబ్ లోని మఝూ ప్రాంతంలో ఆప్ యూత్ విభాగ కన్వీనర్ గా సుఖ్ రాజ్ పని చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో బల్జిందర్ కౌర్ తో వివాహం జరిగింది. ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉన్న కౌర్ తాల్వండి సాబో నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. అయితే.. భర్త సుఖ్ రాజ్ సింగ్.. ఆమె మధ్య ఏదో వివాదం చోటు చేసుకున్నట్లు వీడియోలో అర్థమౌతోంది. అక్కడున్న వారు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సుఖ్ రాజ్.. భార్యపై చేయి చేసుకున్నారు. పక్కనున్న వారు అతడిని అడ్డుకుని లోనికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.