ఇది ఎలచ్చనూ : పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు

ఇది ఎలచ్చనూ : పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు

పశ్చిమ బెంగాల్​ లో పంచాయతీ ఎన్నికల పోలింగ్​జరుగుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తి బ్యాలెట్​ బాక్స్​ఎత్తుకెళ్లడం కలకలం సృష్టించింది.  సంబంధిత వీడియో సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. వెస్ట్​బెంగాల్​లో జులై 8న పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.  కూచ్ బెహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి బ్యాలెట్ బాక్స్‌తో పరుగెత్తాడు. చాలా చోట్ల బ్యాలెట్ బాక్స్​ లు ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. 

ఈ ఘటన పోలీసులు, భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే జిల్లాలోని దిన్‌హటా  బరానాచినాలోని ఓ పోలింగ్ బూత్‌లో బోగస్​ ఓట్లు వేస్తున్నారని కొందరు బ్యాలెట్​ బాక్స్​కి నిప్పు పెట్టారు. ఈ ఎన్నికలను  2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు పరీక్షగా భావిస్తున్నాయి. 22 జిల్లా పరిషత్‌లు, 9,730 పంచాయతీ సమితి, 63,239 గ్రామ పంచాయతీల్లో  దాదాపు 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా ఆందోళనకారుల  నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారు పలు చోట్ల  వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు. 2018 లో, పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ 34 శాతం సీట్లతో పోటీ లేకుండా గెలిచింది. అప్పుడు కూడా హింస తలెత్తింది.