కేసీఆర్​పై పిటిషన్ ఉపసంహరణ

కేసీఆర్​పై పిటిషన్ ఉపసంహరణ
  • కేసీఆర్​పై పిటిషన్ ఉపసంహరణ
  • హైకోర్టు తప్పుపట్టడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్న బల్మూరి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కాంగ్రెస్ నేత, ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు శుక్రవారం ఉపసంహరించుకున్నారు. బాన్సువాడలో  ఈ నెల 30న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం కాంగ్రెస్ నేతల పరువుకు భంగం కలిగించేలా ఉందంటూ ఈ పిటిషన్ ను బల్మూరి వెంకట్ హైకోర్టులో దాఖలు చేశారు. అయితే,  కేసీఆర్ ప్రసంగంపై ఆయన నవంబర్ 3న ఈసీ సీఈవోకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వెంటనే హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఉన్నత న్యాయ స్థానం తప్పుపట్టింది. 

నవంబర్ 30వ తేదీలోగా ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకోవాలనే తపన ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికల అధికారికి గడువివ్వాలి కదా అని వ్యాఖ్యానించింది. దీంతో బల్మూరి వెంకట్ తన పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ శ్రామణ్​ కుమార్ లతో కూడిన ధర్మాసనం అందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.