బయ్యారం పేరుతో టీఆర్ఎస్ డ్రామాలు

బయ్యారం పేరుతో టీఆర్ఎస్ డ్రామాలు

బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. అధికారం చేపట్టి 8ఏళ్లు గడిచే వరకు ప్రభుత్వానికి ఈ విషయం ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ ఎన్నో పోరాటాలు చేసిందని బలరాం నాయక్ గుర్తు చేశారు. యూపీఏ హయాంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కింద ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పారు. యూపీఏ సర్కారు అప్పట్లోనే స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందని, బయ్యారం ఉక్కు నాణ్యమైనదని నిపుణుల కమిటీ రిపోర్టు కూడా ఇచ్చిందని అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిచ్చినంత కాలం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదని బలరాం నాయక్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు పార్లమెంటులో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రాజీనామాలు చేసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని బలరాం నాయక్ సవాల్ విసిరారు.

For more news..

నాడు ఎల్లో సారీలో.. నేడు స్లీవ్ లెస్‎లో

నేటి నుంచి కొత్త జిల్లాల అభ్యంతరాలపై సమీక్షలు