నాడు ఎల్లో సారీలో.. నేడు స్లీవ్ లెస్‎లో

నాడు ఎల్లో సారీలో.. నేడు స్లీవ్ లెస్‎లో

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో’ అని ఓ సినీ కవి చెప్పిన మాట ఈ ఫొటో చూస్తే గుర్తురాక మానదు. యూపీలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్ రీనా ద్వివేది హాట్ టాపిక్‎గా మారారు.

 

రీనా ద్వివేది స్వస్థలం యూపీలోని డియోరియా. ఆమె ప్రస్తుతం యూపీ ఎన్నికలకు పోలింగ్ ఆఫీసర్‎గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలింగ్ విధులకు వెళ్లడానికి ఆమె పోలింగ్ బాక్సులతో బయలుదేరినప్పటి ఫొటోలు నెట్‎లో షేర్ అవుతున్నాయి.  స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి ఎన్నికల విధులకు వెళ్లడానికి సిద్దమయ్యారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా రీనా ఫొటోలు వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఫొటోలు తెగ ఫెమస్ అయ్యాయి. ఎల్లో సారీతో ఎన్నికల విధులకు వచ్చిన ఆమె ఫొటోను తోటి ఉద్యోగులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆమె ఫొటోలు అప్పుడు కూడా తెగ వైరలయ్యాయి. దాంతో రాత్రికి రాత్రే ఆమె ఇంటర్నెట్‎లో ట్రెండింగ్ అయ్యారు. ప్రస్తుతం రీనా లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆమె డ్రెస్సింగ్ లో మార్పు గురించి అడిగితే.. ‘తోడా చేంజ్ హోనా చాహియే (కొంచెం మార్పు అవసరం)’ అంటూ నవ్వుతూ చెప్పింది. 

For More News..

పేరెంట్స్ ఓటేస్తే.. పిల్లలకు 10 మార్కులు

ఇటుక బట్టీలో కోటి రూపాయల డైమండ్

సినీ ఇండస్ట్రీలో మరో మరణం