35 వాట్సాప్ గ్రూపులు బ్యాన్ చేసిన కేంద్రం

35 వాట్సాప్ గ్రూపులు బ్యాన్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : అగ్నిపథ్ పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం 35 వాట్సాప్ గ్రూప్ లను ఆదివారం బ్యాన్ చేసింది.  పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. నిషేధానికి గురైన వాట్సాప్ గ్రూప్​ల పేర్లు, వాటి నిర్వాహకులపై తీసుకున్న చర్యల గురించి అధికారులు వెల్లడించలేదు. దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్' రిక్రూట్‌మెంట్ స్కీమ్​పై నిరసనలు వెల్లువెత్తుతున్నా.. దాన్ని వెనక్కి తీసుకునేది లేదని త్రివిధ దళాలు ఆదివారం స్పష్టం చేశాయి. పైగా నియామక షెడ్యూలును కూడా విడుదల చేశాయి.