సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ 5 పేజీల లేఖ

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ 5 పేజీల లేఖ

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ చేపట్టిన పాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం పెద్ద లింగా పూర్ నుంచి  సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ తో ఇవాల్టి పాదయాత్ర జరగనుంది. పాదయాత్రకు దళిత సంఘాల ప్రతినిధులు, ఓయూ జేఏసీ నేతలు హాజరు కానున్నారు.

మరోవైపు దళిత బంధు, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సీఎం కేసీఆర్ కు 5 పేజీల లేఖ రాశారు బండి సంజయ్. దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. మూడెకరాల భూమి, దళిత సీఎం హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కేబినెట్ లో దళితులకు సరైన ప్రాధాన్యం లేదని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ, అంబేద్కర్ టవర్స్ ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టాలన్నారు. 

 

see more news

హైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్‌కు అటెండ్

ఫుడ్ డెలీవరీ డ్రోన్ పై పక్షి దాడి.. వైరల్ అవుతోన్న వీడియో